ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేయండి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఎన్‌డిఎ కూటమిలో ఉన్న టిడిపి, జనసేన డిమాండ్‌ చేయాలని వైసిపి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సూచించారు. స్థానికంగా మంగళవారం తన కార్యాలయంలో రామసుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బిజెపికి దేశంలో అనుకున్న సీట్లు రాకపోవడంతో ఖచ్చితంగా కూటమిలో ఉన్న పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఇదే సమయంలో బిజెపి తర్వాత టిడిపి అత్యధిక స్థానాలతో రెండవ స్థానంలో ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, పరిశ్రమలు, ప్రత్యేకహోదా కోసం డిమాండ్‌ చేయా లన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వైసిపి నాయకులు, కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడడం సరైంది కాదన్నారు. వాటిని వెంటనే ఆపాలని ఆయన కోరారు. పోలీసులకు కూడా లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేకుండా వ్యవహరించాలన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం కృషి చేయాలన్నారు. నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామసుబ్బారెడ్డి కోరారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️