విద్యార్థుల ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా: ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

Nov 2,2024 16:43 #antapuram

ప్రజాశక్తి – నార్పల : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని కోరుతూ శనివారం నార్పల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ. జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజనం ప్రారంభించాలని పెండింగ్ ఉన్న వసతి దీవెన విద్య దీవెన విడుదల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడి పోస్టులు అదనంగా పెంచాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థ్, జిల్లా ఉపాధ్యక్షులు తరిమల గిరి, జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు సోము డిమాండ్ చేశారు. అదేవిధంగా
డిగ్రీ, ఇంజనీరింగ్, బి-ఫార్మసీ వంటి ఉన్నత మైన విద్యలో పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ దాదాపుగా 3480 కోట్లు రూపాయలు పెండింగ్ లో ఉంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్రలో సందర్భంగా అధికారం వస్తే నెల రోజుల్లో రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి  వాటి గురించి మాట్లాడడం లేదు ఇప్పటి 2024-2025 విద్య సంవత్సరం ప్రారంభమైనది 1,3,5 సెమిస్టర్ లకు పరీక్ష ఫీజులు కట్టాలని యూనివర్సిటీ నుంచి సర్కిల్ వచ్చింది ఇప్పటికి కొన్న ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యం పెండింగ్లో ఉన్న మొత్తం డబ్బు చెల్లించాలని విద్యార్థులకు ఒత్తిడి గురిచేస్తుంది కానీ ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదు. డబ్బు కట్టాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇప్పటికి అయినా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మండల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 6వ తేదీన చలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎన్నిక సందర్భంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేసింది నూతనంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పున ప్రారంభిస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు నారాలోకేష్ హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని అంశంపై చర్చించాలని సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జయకృష్ణ, రహీం సాయి,జాన్సన్ ,టోనీ, విగ్నేష్ హర్ష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️