ప్రజాశక్తి – ఉండ్రాజవరం: సుస్థిర గ్రామాభివృద్ధి ధ్యేయంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో వి వి వి ఎస్ రామారావు సూచించారు. గురువారం ఆయన అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు వంటి స్థానిక ప్రజాప్రతినిధులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల స్థాయి అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025-26 గ్రామపంచాయతీ వార్షిక ప్రణాళికలు తయారు చేయుట, మార్గదర్శకాలు సూచిస్తూ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఈ ఓ పి ఆర్ డి కె ఆంజనేయ శర్మ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
