నెల్లిమర్లలో ఆర్మీ మాజీ జవాను ఇల్లు కూల్చివేత

నెల్లిమర్ల (విజయనగరం) : విజయనగరం జిల్లా నెల్లిమర్ల దన్నానపేటలోని ఆర్మీ మాజీ జవాను ఇంటిని అధికారులు శనివారం కూల్చివేశారు. టిడిపి మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో జవాను ఇంటిని కూల్చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. టిడిపి నాయకుల ఆక్రమణలు కూడా తొలగించాలని వైసిపి నాయకులు, స్థానిక ప్రజలు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు.

➡️