ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ద్రాక్షారామ భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో, అన్నాయిపేట, వెలంపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో 100 మంది విద్యార్థులకు నోటి సమస్యల పై అవగాహన కల్పించి, పరీక్షలు చేసి ,ఉచితంగా పేస్టులు, బ్రష్ లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు ముత్తయ్య , జనకిరత్నం ,సిబ్బంది పాల్గొన్నారు.
