పాఠశాలలను పరిశీలించిన డిఇఒ

Nov 12,2024 22:07

ప్రజాశక్తి – భామిని : స్థానిక జిల్లా పరిషత్‌, ఆశ్రమ పాఠశాల, ఆదర్శ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.తిరుపతినాయుడు మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల అపార్‌ ఐడిపై పాఠశాలలో సూచనలు చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల అకాడమీ స్టాండర్డ్స్‌ను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. పాఠశాలలో రుచికరమైన భోజనం, ఆహ్లాద వాతావరణంలో పిల్లలకు అర్ధవంతగా పాఠ్యాంశాల బోధనకు ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 ఊయక భాస్కరరావు ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం : మండలంలోని తాటిశీల ఎంపిపి పాఠశాలను జిల్లా విద్యాశాఖధికారి ఎన్‌.తిరుపతినాయుడు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రార్ధనా సమయానికి విద్యార్థులంతా హాజరు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు, ఇంగ్లీష్‌, లెక్కలు సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బడితోటలో పెరిగే కూరగాయల మొక్కలు, పూల తోటలు, పరిసరాల పరిశుభ్రతను చూసి కొనియాడారు. ఉపాధ్యాయుల టీచింగ్‌ డైరీ, లెసన్‌ ప్లాన్‌, పరీక్షా పత్రాలు, మూల్యాంకన పత్రాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఇఒలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

➡️