ఉన్నత పాఠశాలలో డిఇఒ తనిఖీ

ప్రజాశక్తి-కొత్తపట్నం : కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర శుక్రవారం పరిశీలించారు. యూడైస్‌కు సంబంధించి పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం రిజిస్టర్లను పరిశీలించారు. తాగునీటి వాటర్‌ ప్లాంట్‌ పనిచేస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలించారు. శిక్షా సప్తాV్‌ాలో భాగంగా సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను పరిశీలించారు. అందరూ చాలా చక్కగా చేశారని విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నేను బడికి పోతా కార్యక్రమం, విద్యార్థుల హాజరు పెంపు, మధ్యాహ్న భోజనం 80 శాతం మంది విద్యార్థులు తినే విషయం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్‌ ,శానిటేషన్‌ పరిస్థితి, కంప్లైంట్‌ బాక్స్‌ ఉపయోగిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఇఒలు తులసికుమారి, పద్మావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పున్నయ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️