‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి : డిఇఒ

ప్రజాశక్తి-సంబేపల్లి (రాయచోటి) మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా కషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం సూచించారు. బుధ వారం సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. సిలబస్‌ పూర్తయిందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి పునాది వంటిదన్నారు. లక్ష సాధన కోసం పట్టుదల, అంకితభావంతో బాగా చదవాలన్నారు. పరీక్షలలో చూచి రాతలు ఉండవని, అత్యంత పగడ్బందీగా పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగ్రహణాత్మక పరీక్షలలో వచ్చిన మార్కులు ఆధారంగా పదవ తరగతి విద్యార్థులను ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజించాలన్నారు. డి గ్రూపులోని విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక అనుసరించాలన్నారు. ముఖ్యమైన భావనలపై, పట్టికలపై, పటాలపై వారికి తరీాదుే ఇవ్వడం ద్వారా వారిని కూడా ఉత్తీర్ణులను చేయవచ్చన్నారు. సబ్జెక్టు వారీగా ముఖ్య మైన మూడు మాదిరి ప్రశ్నాపత్రాలను రూపొందించాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ఎస్‌సిఇఆర్‌డి రూపొందించిన 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం ఏకలవ్య ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌ పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులు రుక్సానా, మౌనిక, తరుణ్‌ కుమార్‌ గౌడ్‌లకు మెమోంటోలను ఇచ్చి వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, ఏకలవ్య పాఠశాల కో-ఆర్డినేటర్‌ రెడ్డి శేఖర్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️