ప్రజాశక్తి – సంబేపల్లి (రాయచోటి) స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రజాభిప్రాయ సేకరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మిళిత అభివద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖాధికారి శివ ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును, విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతం త్య్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ అభివద్ధి, ఆర్థిక అభివద్ధికి తోడ్పడే విధంగా స్వర్ణాంధ్ర విజన్ – 2047ను రూపకల్పన చేశారన్నారు. ఈ విషయమై అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సర్వేలోని అంశాలపై తమ అభిప్రాయాలను నమోదు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారన్నారు. ఈ సర్వేలో ఎక్కువ మంది పాల్గొనేలా మండల విద్యాశాఖాధికారులు, ప్రధానో పాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలో ఉన్న భవిత కేంద్రాన్ని సందర్శించారు. విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల బోధనకు ఉపయోగిస్తున్న బోధనోపకరణాలను, బోధన చేస్తున్న తీరును పరిశీలించారు. మండలంలోని విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులను భవిత కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేయించి వారి సంక్షేమానికి, అభివద్ధికి కషి చేయాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వారి తల్లిదండ్రులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అదే ఆవరణంలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గదికి చేరుకుని రెండవ సెమిస్టర్ పాఠ్యపుస్తకాల పంపిణీని పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్టిక్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, ఎంఇఒ-1 రమాదేవి, ఎంఇఒ-2 శ్రీనివాసులు, సమ్మిళిత విద్య ఉపాధ్యాయులు రవి, ప్రసాద్, హరిత, హెడ్ టీచర్ జయమ్మ, ఎంఐఎస్ కో- ఆర్డినేటర్ పుష్పలత, ఎంఆర్‌సి కంప్యూటర్ ఆపరేటర్ ప్రదీప్, సిఅర్‌పి నరేంద్ర పాల్గొన్నారు.
