ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ఉపాధ్యాయులకు, విద్యారు ్థలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి యు. శివ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని పాఠశాలల్లో వసతులు, విద్యాసామగ్రి పంపిణీ, బోధన వంటి విషయాలపై ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.జిల్లాలో డిప్యూటీ డిఇఒ, ఎంఇఒ, ఉపాధ్యాయుల వివరాలు తెలపండి? జిల్లాలో డిప్యూటీ డిఇఒలు రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో ఉన్నారు. మండల విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 30 మండలాల్లో మొత్తం 58 మంది ఉన్నారు. 7,829 మంది ఉపాధ్యాయులున్నారు.జిల్లాలో ప్రభత్వ, ప్రయివేట్ పాఠశాలల వివరాలు తెలపండి ? జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ 2,210 పాఠశాలలున్నాయి. 1,48,969 విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 545 ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. 93,903 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 197, యు పి 132, హై స్కూల్ 216 పాఠశాలలున్నాయి.ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పూర్తిస్థాయిలో అందాయా? ఈ ఏడాదిలో పాఠ్యపుస్తకాలు జిల్లా వ్యాప్తంగా పాఠ్య పుస్తకాలు, కిట్లు దాదాపు అందరికీ అందజేశాం. . తల్లికి వందనం విద్యార్థులకు వర్తించాలంటే ప్రతి రోజు పాఠశాలకు రావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థి హాజరు శాతం 75 శాతంకు తగ్గకుండా ఉండాలి.విద్యార్థులకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలను కుంటున్నారా ? విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలి. ఉపాధ్యాయుల సూచనలు పాటించి అన్ని పాఠ్యాంశాలను శ్రద్ధగా విని ఎప్పటికప్పుడూ పాఠ్యాంశాలను చదువుకోవాలి.పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి.
