ఉర్దూ హైస్కూల్లో డిఇఒ ఆకస్మిక తనిఖీ

ప్రజాశక్తి-కడప అర్బన్‌ నగర పాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి యు.మీనాక్షి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని ఆమె స్వయంగా తిని చూసి మరింత నాణ్యతగా భోజనాన్ని విద్యా ర్థులకు అందిం చాలన్నారు. జిల్లాను అన్నింట్లో ప్రథ మంగా ఉంచడమే ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల ప్రధమ కర్తవ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు బోధన, భోజనం మంచి నాణ్యతగా అందించాలన్నారు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యా యులు విద్యార్థుల క్రమశిక్షణ, క్రీడలలో నైపుణ్యం పెంపొందించుటకు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను ఏరోజుకారోజు అప్డేట్‌గా ఉంచాలన్నారు. ప్రతి పాఠశాలలో యూ డైసు, మార్కుల నమోదు, అపార్‌ కలిసికట్టుగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యా శాఖ నుంచి వచ్చే అన్ని రకాల పనులను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా విద్యాశాఖకు మంచి పేరు, గుర్తింపు తీసుకువచ్చేందుకు కషి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో మన జిల్లా మొదటి స్థానం వచ్చేటందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పట్టుదలతో కషి చేయాలన్నారు. డిసెంబర్‌ 7వ తేదీ జరగబోవు లిమెగా పేరెంట్‌ టీచర్స్‌ సమావేశములి ను ప్రతి పాఠశాలలో దిగ్విజయం చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు సి.విజయలక్ష్మి , ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎండి ఇలియాస్‌ భాష, ఖాజాపీర్‌, ఎస్‌ఎండి అయూబ్‌, జాకీరా ఖానమ్‌, మహబూబ్‌ బాషా, వ్యాయామ ఉపాధ్యా యుడు సాజిత్‌, సిఆర్‌ఎంటి ఆదిమూలం శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️