ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 1 న రానున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సా 4.50 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం ద్వారా కాలి నడకన రాత్రి 8 గంటలకు తిరుమల చేరుకుని రాత్రికి బస చేస్తారు. అక్టోబర్ 2 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.05 గంటలకు మాతఅ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. బుధవారం రాత్రి తిరుమలలో బస చేస్తారు. అక్టోబర్ 3 న సా.4.30 గంటలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్న వారాహి సభ కార్యక్రమంలో పాల్గంటారు. రా8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడ తిరుగుప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.