ప్రజాశక్తి – క్యాంపస్ (తిరుపతి) : రాష్టంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన, పేరు ప్రఖ్యాతులు కలిగిన విద్యా కేంద్రంగా వెలసిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాజకీయ రంగు పులుముకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఒక విద్యా సంస్థలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుండడం విడ్డూరంగా ఉంది. ఇదే సాకుగా సోమవారం తరగతులకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు కళాశాలలకు వెళ్లే ప్రధాన ద్వారాలైనటువంటి మొదటి గేటు, రెండవ గేటు, ఐదవ గేటు మూసివేయడం విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహించే విధాన క్రమంలో ఎస్వీయూలో ఎన్నికలు జరగడం ఏంటని విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇటు విద్యార్థులకు, వర్సిటీ సిబ్బంది, అధ్యాపకులకు సమయానికి కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర విగాథంగా కలిగిస్తోంది. వర్సిటీలో రాజకీయాలు చేయడం ద్వారా కోటం ప్రభుత్వం విద్యార్థులకు ఏ సందేశం ఇస్తుందని, సమాజానికి ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వర్సిటీ మొత్తం పోలీసు పహారాలో ఉంది పోలీసులు చూసిన విద్యార్థులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. వర్సిటీలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలోని పెద్ద ఎత్తున పోలీసు పహారా ఎన్నికల నిర్వహణ జరగడం విధులకు విఘాతం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూలో డిప్యూటీ మేయర్ పర్మిషన్ ఎలా ఇస్తారని విద్యార్థి సంఘాల నేతలు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎస్ వి ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
