ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం జిల్లాలో గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వర్షపాతం వివరాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా సగటున 34.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అని ఇందులో అత్యధికంగా సీతమ్మధార ప్రాంతంలో 62.6 కురవగా అత్యల్పంగా పద్మనాభం మండలంలో 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంతేకాకుండా మహారాణిపేట 58.4, విశాఖపట్నం రూరల్ 46.4, ములగాడ 40.2, పెదగంట్యాడ 39.6, గోపాలపట్నం 38.6, గాజువాక 36.4, పెందుర్తి 26.8, భీమునిపట్నం 20.2 ఆనందపురం 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
