ప్రజాశక్తి….విజయనగరం టౌన్ : తన ఉద్యోగ జీవితం సంతఅప్తినిచ్చిందని జిల్లా పరిషత్ పర్యవేక్షకులు దేవరాపల్లి.అప్పన్న అన్నారు. ఈ నెల ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఉద్యోగ జీవిత విశేషాలను ప్రజాశక్తితో పంచుకున్నారు. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు సంబంధించిన సాంఘిక సంక్షేమ శాఖలో, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకంలో పనిచేసే అవకాశం రావడం తమ అదఅష్టంగా భావిస్తున్నానన్నారు. మనం చేసే వఅత్తిలో అంకిత భావంతో పనిచేసేటప్పుడు అందరి మన్ననలు పొందుతామని తెలిపారు. తాను పనిచేసిన ప్రతి ప్రాంతంలో అందరినీ కలుపుకుంటూ స్నేహ పూర్వకంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం జరిగిందనీ, ఉద్యోగం పట్ల మక్కవతో ఇష్టంగా చేయడం వలన అందరికీ దగ్గర కాగలిగాననీ చెప్పారు. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న పనిలో సక్రమంగా చేసుకున్నప్పుడు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందనీ, తాను అవకాశం ఉన్నంతవరకు ఆ విధంగా చేయడం వలన అందరికీ దగ్గర కాగలిగానని చెప్పారు.
కుటుంబ నేపథ్యం …
దేవరాపల్లి సప్నబాబు, సత్యవతి దంపుతుల ఏకైక కుమారుడు అప్పన్న 1962లో జిన్నాం గ్రామం, గజపతినగరం మండలంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. భార్య గౌరి గఅహిణి. ముగ్గురు కుమారులు. జీవితంలో మనల్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేది చదువు మాత్రమే అని నమ్మడంతో పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించారు. పెద్ద అబ్బాయి జగదీశ్ కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ పీజీ చేసి సాఫ్ట్‌వేర్ వఅత్తిలో మేనేజర్ స్థాయి అధికారిగా హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్నారు. కోడలు శైలజ బిఎస్‌ఎన్‌ఎల్లో సబ్ డివిజనల్ ఇంజినీర్ చేస్తున్నారు. రెండవ అబ్బాయి లోకేష్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేసి, రాష్ట్ర రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీలో కమ్యూనికేషన్ ఇంజనీర్ గా, కోడలు హైమావతి ఉపాధ్యాయురాలుగా చేస్తున్నారు. తఅతీయ కుమారుడు రమేష్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఐఐటీ వారణాసి నుండి ఎంటెక్ చేసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబైలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు, కోడలు శ్రీవల్లి డాక్టర్‌గా ఉన్నారు.