ఆదరిస్తే.. అభివృద్ధి : మేరుగ

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ అభ్యర్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని మద్దిరాలపాడు గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని తెలిపారు. సంక్షేమం-అభివద్ధి సమానంగా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నాగులుప్పలపాడులో ఏర్పాటు చేసిన వైసిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నాగులుప్పలపాడు,ఓబన్నపాలెం, మాచవరం, రాపర్ల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, లిడ్‌ క్యాంపు డైరెక్టర్‌ కంచర్ల సుధాకర్‌ , నలమలపు కష్ణారెడ్డి, ఎఎంసి చైర్మన్‌ మారెళ్ళ బంగారుబాబు, నాయకులు పి. శ్రీమన్నారాయణ, ఇనగంటి పిచ్చిరెడ్డి, జడ్‌పిటిసి యాదల రత్నభారతి, పెనుబోతు రంగారావు,ప్రసన్న, రమణారెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు కె.విజయకుమార్‌, పి.చెన్నకేశవులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️