సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి – చాగలమర్రి : అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ భాష తెలిపారు. శుక్రవారం స్థానిక నాలుగవ ఎంపీటీసీ టిడిపి ఇంఛార్జ్ నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదేశాలతో చాగలమర్రి పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా చేపట్టామన్నారు. ప్రతి తెలుగుదేశం నాయకులు, కార్యకర్త టిడిపి అభిమానులు తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు తో కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మౌలాలి, ముల్లా గఫార్, విద్యా కమిటీ చైర్మన్ గౌస్ మొహిద్దిన్, హనీఫ్, వెంకట్ రెడ్డి, రాజేష్, మాప్పీర్ మునాఫ్, జెట్టి సురేష్, జెట్టి కుమార్, జెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.