అంతర్గత రోడ్ల అభివృద్ధి

ప్రజాశక్తి -యద్దనపూడి (బాపట్ల) : స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చొరవతొ మండలంలోని అనంతవరం గ్రామములోని యస్‌. సి కాలనీ లో సి. సి రోడ్ల నిర్మాణానికి 40 లక్షలు రూపాయలు మంజూరు అయినట్లు గ్రామ నాయకులు తారక, వంశీలు శనివారం విలేకర్లకు తెలిపారు. సి. సి రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని గ్రామ నాయకులు పరిశీలించారు. గత వై. సి. పి ప్రభుత్వ హయాంలో పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడంతొ గ్రామాలు వెల వెల పోయాయి అని నాయకులు విమర్శించారు. గత ఐదేళ్లలో గ్రామాలలో తూ తూ మంత్రంగా సి. సి రోడ్లు వేసి మమ అనిపించారని వారు అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తక్కువ కాలంలోనే సి. సి రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతొ గ్రామములో కొత్త శోభ సంతరించుకుంది అన్నారు. కాలనీ వాసులు రోడ్ల అభివ‡ద్ధికి చొరవ తీసుకున్న శాసన సభ్యులు ఏలూరి శాంబశివరావుకు ధన్యవాదములు తెలిపారని చెప్పారు.గతంలో బురద రోడ్లతో ఇబ్బంది పడిన ప్రజలు సి. సి రోడ్లతో ఇబ్బందులు తోగాయి అన్నారు. సమావేశంలో గ్రామ నాయకులు పోపూరి హనుమంతరావు, వెంకట రత్తయ్య,ప్రసాద్‌, సురేష్‌,రూబెన్‌, పాల్గొన్నారు.

➡️