పాత్రికేయుల అభివృద్ధి నా బాధ్యత : ఎమ్మెల్యే షాజహాన్‌ భాష

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : పాత్రికేయుల అభివృద్ధి తన బాధ్యత అని, అన్ని విధాల సహకరించడంతో పాటు రెండు కుంటల ఇంటి స్థలం, 15 బస్తాలు సిమెంట్‌, ఉచితంగా ఇసుక ఇళ్ల నిర్మాణాల వద్దకే చేర్పిస్తానని ఎమ్మెల్యే షాజహాన్‌ భాష హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌ లో సెక్రటరీ చంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ఎమ్మెల్యే కు పూలమాలలు వేసి, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాత్రికేయులందరూ నిరుపేదలేనని వారి అభివఅద్ధిని బాధ్యత గా తీసుకుంటానన్నారు. సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర కీలకమని, మదనపల్లె అభివఅద్ధికి చేయూతనివ్వాలన్నారు. పాత్రికేయులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులన్నారు. అన్ని రంగాల్లోను, అన్ని వర్గాలవారిని, చైతన్యపరుస్తూ ఫోర్త్‌ ఎస్టేట్‌ గా ఉన్న పాత్రికేయులకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో మదనపల్లె పరిసరాలు పెద్ద స్థాయిలో భూ కబ్జాలకు గురయ్యాయన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇంకొకరు కబ్జా చేయాలంటే భయపడే విధంగా చేసి ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించడమే తన ధ్యేయమన్నారు. ఈ విషయంలో పాత్రికేయులు సైతం సహకరించి నిజాన్ని నిర్భయంగా ప్రచురించాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు చంద్ర, రమేష్‌, సీనియర్‌ పాత్రికేయులు శ్రీనివాసులు, శివారెడ్డి, శ్రీనివాస గౌడ్‌, బాలనాగు, శివప్రసాద్‌, గోపాల్‌, సీతారామ్‌, కిరణ్‌ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

➡️