పాఠశాలల అభివద్ధే పిటిఎం లక్ష్యం : డిఇఒ

ప్రజాశక్తి-పీలేరు విద్య, పాఠశాలల అభివద్ధే లక్ష్యంగా డిసెంబర్‌ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్‌ టీచర్‌ మీట్‌ విజయవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ కె. సుబ్రహ్మణ్యం తెలి పారు. శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి పీలేరు పట్టణం, కోటపల్లి జడ్‌పిబాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమై, డిసెంబర్‌ 7న జరగనున్న మెగా పేరెంట్‌ టీచర్‌ మీట్‌పై కీలక సూచనలు చేశారు. విద్యా ప్రాధాన్యతను గుర్తించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని ఏర్పరచాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. విద్యాభివద్ధి, పాఠశాలల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా పేరెంట్‌ టీచర్‌ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సమావేశం విద్యార్థుల భవిష్యత్తుకు కీలకంగా ఉం డాలని, తల్లిదండ్రుల భాగస్వా మ్యంతో పాఠశాల అభివద్ధిలో ఒక ముఖ్యమైన మలుపు కావాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థీ తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికలు అందించి, వారిని తప్పక హాజరు పరచాలని సూచించారు. ఆ రోజున విద్యార్థులందరికీ హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను పంపిణీ చేయాలని కూడా ఆదేశించారు. సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా, పూర్తిగా విద్యా విషయాలపై చర్చించాలని చెప్పారు. ఉన్నత స్థాయిల్లో ఉన్న ఆ పాఠశాల పూర్వ విద్యార్థుల విజయ గాధలను వివరిస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. సమావేశాల్లో తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాఠశాల అభివద్ధికి కషి చేయాలని, విద్యారంగంలో ప్రోత్సాహం కలిగించేలా అతిథులు విద్యార్థులతో మాట్లాడేలా చూడాలని చెప్పారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ సమావేశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పేర్కొన్నారు. ఎఇఒలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అందరూ కలిసి హాజరుకా వాలన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. అనంతరం డిఇఒ స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. సమావేశం విజయవంతం అయ్యేందుకు ఎంఇఒలు, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో కోటపల్లి జడ్‌పిఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివశంకరయ్య, పాఠశాల సిబ్బంది, మండల విద్యాశాఖ అధికారులు వై. లోకేశ్వర్‌ రెడ్డి, బి. పద్మావతమ్మ, సిఆర్‌పిలు, జలకనూరి మురళీధర్‌ రాజు, మాధవి, అశోక్‌, నాగరాజు, డీఈఓ క్యాంప్‌ క్లర్క్‌ హబీబ్‌బాషా పాల్గొన్నారు.

➡️