వైసిపి ప్రభుత్వంలోనే అభివృద్ధి

– వైసిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డిప్రజాశక్తి-కమలాపురం టౌన్‌ రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైసిపి జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ చేసిన అభివద్ధిని తనదిగా చెప్పుకుంటున్నారని తెలిపారు. జగన్‌ ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రధానితో శంకుస్థాపన చేయించడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. రాయలసీమ తర్వాత బాగా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని ఉత్తరాంధ్ర జిల్లాల అభివద్ధి జరిగిందంటే ఒక్క రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డితోనే అని 2014-19 అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల అభివద్ధి పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2019-24లో వైసిపి ప్రభుత్వం ఉత్తరాంధ్రపై ప్రత్యేక దష్టి సారించి పారిశ్రామికంగా అక్కడి ప్రజలను ఆర్థికంగా అభివద్ధి చేసిందన్నారు. ఉద్దానంలో కలుషిత నీటి సమస్యతో కిడ్నీ బారిన పడిన ప్రజలకు రూ.700 కోట్లతో ఆసుపత్రి నిర్మించి, అక్కడి ప్రజలకు మంచినీటిని సౌకర్యం కల్పించింది, భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌, జిల్లాలో మెడికల్‌ కాలేజ్‌ని నిర్మించి ఆ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్‌దే అని చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయం, అభివద్ధికి నిధులు విడుదల చేస్తామని ప్రకటన చేపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మారుజోల్ల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాజుపాలెం సుబ్బారెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ ఉత్తమరెడ్డి, నగర పంచాయతీ అధ్యక్షులు గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️