విజయవాడ (ఎన్టీఆర్ జిల్లా) : విజయవాడ ముఖ్య మేజిస్ట్రేట్ లో విచారణ నిమిత్తం టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా హాజరయ్యారు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం షాబాద్ – జక్కంపూడి లో గతంలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ … పరిశీలించడానికి దేవినేని ఉమా, టీడీపీ నేతలు వెళ్లారు. దీంతో ఆనాటి ప్రభుత్వం వారిపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం విజయవాడ ముఖ్య మెజిస్ట్రేట్ కోర్టు కు దేవినేని ఉమా, టీడీపీ నేతలు హాజరయ్యారు. దేవినేని ఉమా, టీడీపీ నేతలపై గత వైసీపీ ప్రభుత్వం సిసి నెంబర్ 2135/23 తో కేసు నమోదు చేసింది. దేవినేని ఉమాతో పాటు టిడిపి నేతలు రంగినేని నరేంద్రబాబు, ధూళిపాలా రమేష్ , బాణావత్ రమేష్ , బర్రా పున్నారావు, గంధం సుబ్బారావు, మేడూరు నరేంద్ర, షేక్ కరిముల్లా, గర్నేపూడి మాధవరావు, పసుపులేటి జమలయ్యలు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.