ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా

Nov 26,2024 21:49
ఫొటో : నిరసన ధర్నా తెలియజేస్తున్న నాయకులు

ఫొటో : నిరసన ధర్నా తెలియజేస్తున్న నాయకులు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా

ప్రజాశక్తి-ఉదయగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు, రైతుసంఘం నాయకులు కోడె రమణయ్య, కాకు వెంకటయ్య మాట్లాడుతూ డాక్టర్‌ స్వామినాథ్‌ సిఫార్సులు అమలు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ అన్ని రకాల ఉద్యోగులకు కనీసం రూ.26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ ఎం.సుభద్రకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రజియా, మండల అధ్యక్షులు గడ్డం నాగేశ్వరరావు, అంగన్‌వాడీ ప్రాజెక్టు అదేక్షురాలు ప్రమీల, ఎంపిటిసి కాకు విజయ, సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️