ప్రజాశక్తి – ప్రకాశం : సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 8 వ తేది నుండి ప్రజాపోరు కరపత్రాలను టంగుటూరు మండలం లో విస్తృతంగా పంపిణి చేసి ఈ రోజు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేయటం జరిగింది. అనంతరం ఆర్. ఐకి సమస్యల తో కూడిన అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం టంగుటూరు ఏరియా కమిటీ కన్వీనర్ టీ. రాము మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోకపోవటం దుర్మార్గమన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫల మయ్యాయని ఆరోపించారు. మన జిల్లా లో వెలుగొండ, సంగమేశ్వరం ప్రాజెక్టు లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.జిల్లెలమూడి ప్రాజెక్టు వద్ద ఇసుక మేటను తొలగించాలని డిమాండ్ చేశారు. టంగుటూరు లోని రాగాయ కుంట 26 ఎకరాలను మంచి నీటి చెరువు గా మార్చాలని డిమాండ్ చేశారు.టంగుటూరు సెంటర్ లో వున్న రైల్వే గేట్ పై ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే పొందూరు, కొణిజేడు గ్రామాల మధ్య ఉన్న ఇనగలేరు పై వంతెన కట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు వి. మోజెస్, టీ. వెంకటరావు .ఎస్కె. మీరాస్ ,టీ. సుబ్బారావు ఎం. యానాది, టీ. పాపారావు, ఎం. కోటయ్య, ఎల్. కొండయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.