సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

ఏలూరు (పశ్చిమ గోదావరి) : సహకార సంఘాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ … ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల ఉద్యోగులు, ఏలూరు డిసిసిబి ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజారామోహన్‌ రారు, డిఎన్వి ప్రసాద్‌, సహకార సంఘం యూనియన్‌ నాయకులు, సహకార సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ డిమాండ్లకు సంబంధించిన ప్రతిపాదనను డిసిసిబి ఇన్చార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి కి అందజేయనున్నారు.

➡️