విశాఖ : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకూడదని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మంగళవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు ఎం జగ్గు నాయుడు, సిపిఐ నాయకులు పైడి రాజు, ఎస్సి నాయకులు సుధాకర్, ఐద్వా నాయకులు సత్యవతి, సిఐటియు నాయకులు ఆర్ కే ఎస్ వి.కుమార్, ఎం.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.