ప్రజాశక్తి-రేగిడి : సంకిలి ప్యారీ షుుగర్స్ ఇథనాల్ ప్లాంట్ వద్ద బుధవారం పుర్లి గ్రామస్తులు ధర్నా చేశారు. క్రషింగ్ ప్రారంభించడంతో చిన్నయ్యపేట సెంటర్ నుంచి పెద్దపుర్లి జిల్లా పరిషత్ రోడ్‌లో కర్మాగార వ్యర్థ పదార్థాలు, రోడ్డుకు ఇరువైపులా చెరకు లారీలు ఉంచడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపై వ్యర్థ పదార్థాలు నిల్వ ఉంచడంతో కొద్దిపాటి వర్షానికి రోడ్డు తడిసినా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. పాలకొండ, రాజాం పట్టణాలకు చదువు కోసం వెళ్లే విద్యార్థినులను డ్రైవర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. యాజమాన్యం సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్రషింగ్ సీజన్ అంతా ఇబ్బంది పడుతున్నామని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులను గ్రామస్తులు పాలవలస మురళి, పాలవలస బుల్లిబాబు, రమణ నిలదీశారు. ఇకపై రహదారిపై వ్యర్థాలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని యాజమాన్య ప్రతినిధులు హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/12/4regidi.jpg)