ప్రజాశక్తి -కొమరోలు : బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ స్వచ్ఛభారత్ కార్మికులు చేపట్టిన 36 గంటల ధర్నా మంగళవారంతో ముగిసింది. కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నుంచి 36 గంటల ధర్నా నిర్వహించారు. అదే విధంగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు త్వరలో బకాయి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా ముగించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు కార్మికులు తెలిపారు.
