జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని … మోకాళ్ళపై నిల్చొని కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-ఏలేశ్వరం (తూర్పు గోదావరి) : గత నెల 16 న అర్థాంతరంగా మూసివేసిన మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్ల పై నిల్చని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ …. ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గత 15 రోజులుగా అనేక విధాల ఆందోళన నిర్వహిస్తున్న యాజమాన్యం కాని, ప్రభుత్వం కాని కనీసం చర్చలు కూడా జరపలేదని ఆరోపించారు. 24 గ్రామాలకు చెందిన 409 మంది కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వెంటనే ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి వీరబాబు, కే.చక్రధర్‌, ఎం.చంటి, ఎస్‌.జయలక్ష్మి, సిహెచ్‌ గోవింద్‌, టి.దేవి, బి.అన్నపూర్ణ ఆధ్వర్యంలో పాల్గొన్నారు.

➡️