నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా :’సిటు’

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, కార్మిక ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించబోయే ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లాఅధ్యక్షులు సి హెచ్‌ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, కోశాధికారి టి.హరిశర్మ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి ఎన్నికల ముందు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వారిని రెగ్యులర్‌ చేస్తామని అధికారం చేపట్టాక ఖజానా ఖాళీ అని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి ప్రభుత్వ సంస్థ లో పని చేస్తున్న అన్ని రకాల విభాగల వారికి సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు పిలుపిస్తే ఏ ఒక్కరూ అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. పని గంటలు పెంచడం,సెలవులు ఇవ్వకపోవడం , చేసిన పనికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, భద్రత లేని ఉద్యోగాలు కార్మికఉద్యోగ చట్టాల రక్షణకై జరుగుతున్న ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

➡️