ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు, వాచ్‌మెన్‌లకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే మంజూరు చేయాలనికోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ ఎడి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి.సుధారాణి మాట్లాడుతూ ఇచ్చే 6000 కూడా నెలల తరబడి చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. తక్షణమే జీతాలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి 50 మంది పిల్లలకు ఒక ఆయాను నియమించాలని, గుర్తింపు కార్డులు, ఈఎస్‌ఐ, పిఎఫ్ , సిక్కిలివ్వులు తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వినతిపత్రం వచ్చిన వారిలో యూనియన్ కార్యదర్శి వై.నందిని, ఉపాధ్యక్షులు పార్వతి, నాయకులు ఉమా, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు, గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని విద్యాశాఖ ఎడికి వినతినిచ్చారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యకు కనుగుణంగా వర్కర్ల సంఖ్యను పెంచాలని ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలన్నారు. గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వినతి ఇచ్చిన వారిలో స్వప్న, రమా, నారాయణమ్మ, పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.