ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్య) : రైల్వే కోడూరులో తాసిల్దారు కార్యాలయం వద్ద సోమవారం ఉదయం అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను అక్రమ అరెస్టులను ఖండిస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి, పి. జాన్ ప్రసాద్, కోడూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు, ఎం.శ్రీరమాదేవి సమస్యల పై తాసిల్దారు మహబూబ్ చాంద్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకుమారి, శిరీష లీలావతి, ఈశ్వరమ్మ, వెన్నెల, మణెమ్మ ,వాణి ,మైథిలి, రెడ్డమ్మ, గాయత్రి, అంగన్వాడి టీచర్లు , ఆయాలు, మినీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
