చిత్తూరు : ”డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, వీలైనంత ఎక్కువ సమస్యలు వచ్చే గురువారం లోపల పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈరోజు చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ”డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నగరపాలకతోపాటు, గుడిపాల, చిత్తూరు రూరల్ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వయంగా విని నమోదు చేసుకోవడంతో పాటు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ జె.అరుణ, మేయర్ ఎస్.అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సీఐ విశ్వనాథ రెడ్డి, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల అధికారులు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనులు చేయండి…
”డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిత్తూరు నగరపాలక సంస్థ, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోన్ ద్వారా అందిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరం క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు. ప్రధానంగా నగర పాలక పరిధిలో డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు, రోడ్లు, పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫిర్యాదులు అందాయని.. వీటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, అభివఅద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణ, ఇళ్ల నిర్మాణం, రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటుపై సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మండల స్థాయిలో, పోలీసులు సంబంధించిన సమస్యలను సంబంధిత ఫిర్యాదుదారులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడం, అభివఅద్ధి పనుల విషయంలో ఎక్కడ రాజీ పడవద్దన్నారు. ప్రజలకు మంచి పనులు చేయడం, సమస్యలను పరిష్కరిస్తాం అనే భరోసా ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కు మంచి పేరు తేవాలన్నారు. ఇదే సమయంలో నగరపాలక పరిధిలో అభివఅద్ధి పనుల కోసం నిధుల కొరత ఉందని, నగరవాసులు పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా అభివఅద్ధి పనులు వేగవంతం చేయవచ్చని, ఇందుకోసం నగరవాసులు సహకరించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో వెనకబాటుతనాన్ని పోగొట్టి, అభివఅద్ధి పథంలో నడిపించడానికి చిత్తశుద్ధితో కఅషి చేస్తానని, నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడంలో భాగంగా.. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారిని, ముఖ్యమంత్రి గౌ. చంద్రబాబు నాయుడు తో మాట్లాడి అదనపు నిధులు సాధిస్తానని చెప్పారు.
”డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమంలో 39 ఫిర్యాదులు..
నగరపాలక కార్యాలయంలో గురువారం నిర్వహించిన ”డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు అందినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఇందులో నగరపాలక సంస్థ -20, పోలీసు -7, రెవిన్యూ -4, నేషనల్ హైవే -1, ట్రాన్స్ కో -1, పంచాయతీరాజ్ -1, ముఖ్యమంత్రి సహాయనిధి, ఆరోగ్యశ్రీ, సాయం కోసం -5 వినతులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ జె.అరుణ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత శాఖల వారీగా పంపడం జరుగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించి నివేదికలను వారంలోగా అందించాలన్నారు.