హెచ్‌ఐవి నివారణకు ‘మీకు తెలుసా’ కార్యక్రమం

Aug 12,2024 19:47
హెచ్‌ఐవి నివారణకు 'మీకు తెలుసా' కార్యక్రమం

ర్యాలీని ప్రారంభిస్తున్న దృశ్యం
హెచ్‌ఐవి నివారణకు ‘మీకు తెలుసా’ కార్యక్రమం
ప్రజాశక్తి-నెల్లూరున్యాకో ఆదేశాల మేరకు హెచ్‌ఐవిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు నెలల పాటు ” మీకు తెలుసా ” ప్రచార కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు ఎం.పెంచలయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన డిఎంహెచ్‌ఓఒ కార్యాలయం ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ విభాగం అధికారి డాక్టర్‌ ఖాదర్‌వల్లి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని డిఎంహెచ్‌ఓ డాక్టరు ఎం.పెంచలయ్య జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు ఎం.పెంచలయ్య మాట్లాడుతూ హెచ్‌ఐవి, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (సెక్స్‌వల్లీ ట్రాన్స్‌మీటెడ్‌ ఇన్‌ఫెక్షన్‌ -ఎస్‌టిఐ) గురించి ప్రజల్లో అవగామన పెంపొం దించేందుకు రెండు నెలలపాటు ” మీకు తెలుసా ” ”ఇంటెన్సిఫైడ్‌ ఐఇసి క్యాంపెయిన్‌” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభాలో హెచ్‌ ఐవి , సుఖ వ్యాధులుల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించండానికీ, సురక్షిత పద్ధతులు పాటించడానికి నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది హెచ్‌ ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. డిఎల్‌ఒ డాక్టరు ఖాదర్‌వల్లి మాట్లాడుతూ అనుమానం ఉన్నవారంతా సిగ్గు పడకుండా తప్పనిసరిగా రక్త పరీక్ష చేయిం చుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి హెచ్‌ఐవి ఎలా సోకుతుంది, ఎలా నివారించ వచ్చు, వ్యాధి సోకినా వారి పట్ల ఎలా ప్రవర్తించాలనేదానిపై అవగాహన కల్పిస్తామన్నారు. రెడ్‌ రిబ్బన్‌ క్లబ్బుల ద్వారా విద్యార్థులు వారి స్నేహితులకు అవగాహనా కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ,స్వచ్చంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

➡️