పరిశ్రమలతోనే జిల్లా ఆర్థిక ప్రగతి – డిఐఇపిసి

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరిప్రజాశక్తి – కడప అర్బన్‌ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. గురువారం కొప్పర్తి పారిశ్రామిక వాడలోని డిక్సన్‌ ఇండిస్టీ మీటింగ్‌ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డిఐఇపిసి) సమీక్ష సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అన్నారు. పారిశ్రామిక రంగాన్ని మరింత అభివద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహకాన్ని పెంపొం దించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తోందన్నారు. అదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండిస్టీయల్‌ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థిక అభివద్ధికి దోహద పడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల ప్రమోషన్‌కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. పారిశ్రామిక వాడలో భద్రత కోసం భద్రతా ఏజెన్సీతో మాట్లాడుకుని ఆయా పరిశ్రమల సమన్వయ సహకారంతో 24 గంటల భద్రతా సౌకర్యాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్‌కు వివరించాచారు. అంతకుముందు కొప్పర్తి పారిశ్రామిక వాడలోని అన్ని క్లస్టర్లల నిర్వహణలో, ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమల యూనిట్లను కలెక్టర్‌ పరిశీలించారు. నూతనంగా అధునాతన వసతులతో నిర్మించిన ఇండిస్టియల్‌ గెస్ట్‌ హౌస్‌ను, అక్కడి వసతులను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో కడప ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌, పరిశ్రమల శాఖ జిఎం చాంద్‌ బాషా, డిఆర్‌ డిఎ పిడి ఆనంద్‌ నాయక్‌, ఐపిఒ ఎల్‌డిఎం జనార్దనం, డిటిసి డిప్యూటీ కమిషన్‌ ఆఫ్‌ లేబర్‌ శ్రీకాంత్‌ నాయక్‌, డిప్యూటీ చీఫ్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ ఫాక్టరీస్‌ కష్ణ మూర్తి, ఎపిఐఐసి ప్రతినిధులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, అగ్నిమాపక డిడిఆర్‌ఎఫ్‌ అధికారులు, డిటిఒ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ, ఎపిఎస్‌ పిడిసిఎల్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.పశువుల అక్రమ తరలింపు నేరం ఎవరైనా పశువులను హింసించినా, బహిరంగ ప్రదేశంలో వధించినా, అక్రమంగా తరలించినా అండర్‌ సెక్షన్‌ 38/1978, సెక్షన్‌ 59/1960 ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేటులోని బోర్డు మీటింగ్‌ హాలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడం సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ ప్రివెంటేషన్‌ ఆఫ్‌ క్రూసిల్టి టు అనిమల్స్‌ యొక్క సొసైటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారని అన్నారు. కడప జిల్లాలో 2017 సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మనోజ్‌ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి శారదమ్మ, డిఇఒ మీనాక్షి, అధికారులు, ఎన్‌జిఒలు పాల్గొన్నారు.మాత మరణాలు ఉండకూడదు : కలెక్టర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత మరణాలు ఉండకూడదని కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని స్పందన హాలులో చెన్నూరు, కొండాపురం, టేకురుపేట, వికలాంగుల కాలనీ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన మాత మరణాలపై సమీక్షిం చారు. మాత మరణాలకు కారణాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, ఉన్నత ఆసుపత్రుల స్పెషలిస్ట్‌ వైద్యులు, ప్రయివేట్‌ ఆసుపత్రుల వైద్యులతో చర్చించారు. ఆయా ఆసుపత్రుల్లో అందించిన సేవలు గురించి అడిగారు. డిసిహెచ్‌ఎస్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి జరుగుతున్న రెఫరల్‌ కేసుల గురించి విచారణ చేయాలని తెలిపారు.

➡️