ప్రజాశక్తి-అనకాపల్లి :
విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల జరిగిన ఇంటర్ పాలిటెక్నికల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీటిలో స్థానిక దాడి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. తమ కళాశాల విద్యార్థులు విజయం సాధించడం పట్ల కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె గణేష్ ప్రసాద్ రెడ్డి, డీన్ కె కృష్ణనాగు, డీన్ అడ్మిన్ డాక్టర్ కె ఈశ్వరరావు, హెచ్వోడిస్ సిఎస్‌సి డిపార్ట్మెంట్ డాక్టర్ కే.సుజాత, ఈఈఈ డాక్టర్ ఏఎస్‌ఎల్‌కే గోపాలమ్మ, ఈసిఈ డాక్టర్ పి పూర్ణప్రియ, సివిల్ వి.భార్గవి, సిఎస్‌డిఎం ఏ. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.