చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన డిఐజి

Dec 4,2024 21:30

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :  జియమ్మవలస మండలం చిన మేరంగి పోలీస్‌ స్టేషన్‌ను విశాఖపట్నం రేంజ్‌ డిఐజి గోపినాధ్‌ జెట్టి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో క్రైమ్‌ రిపోర్ట్‌, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంజాయి, సైబర్‌ నేరాలు, మత్తు పదార్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డిఎస్‌పి రాంబాబు, సిఐలు తిరుపతిరావు, హరి, ఎస్‌ఐలు అనీష్‌, నారాయణరావు ఉన్నారు.

➡️