కేరళ పట్ల వివక్ష తగదు

ప్రజాశక్తి – రేపల్లె : కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని, కేరళ ప్రజలకు ప్రజాతంత్ర వాదులందరూ అండగా నివాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.మణిలాల్‌ కోరారు. కేరళ రాష్ట్రానికి సంఘీభావంగా స్థానిక సిఐటియు కార్యాలయంలో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు నాయకులు మాట్లాడుతూ కేరళ ప్రజల హక్కులు పరిరక్షించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం బీజేపీ యేతర ప్రభుత్వాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్ధిశంచారు. కేరళలో సిపిఎం నాయకత్వాన ఉన్న వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు,అడ్డంకులు కల్పిసుందన్నారు. చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా విడుదల చేయటం లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఒత్తిడితో కొద్దిమేర నిధులు విడుదల చేసినటుల తెలిపారు. అప్పులు చేయడానికి అనుమతించడం లేదన్నారు. గవర్నర్‌ అడ్డం పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ పాస్‌ చేసిన బిల్లులను తొక్కిపెడుతున్నారు. భారత దేశ రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఘాతం కల్పిస్తున్నది.రాష్ట్ర విషయాల్లో ముఖ్యంగా అత్యంత బలవంత మైనటువంటి సహకారరంగం ఉన్న కేరళ రాష్ట్రంలో సహకారరంగాన్ని నాశనం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు విద్యార్ధి, యువజన, కార్మిక,రైతు సంఘం,ఐద్వా, యుటిఎఫ్‌ నేతలు కెవి.లక్ష్మణరావు, ఎల్‌.గోపీ,కె.ఝాన్సీ,కె.సాయి ప్రసాద్‌, జె.ధర్మరాజు,కష్ణ ప్రసాద్‌, దానియేలు తదితరులు పాల్గొన్నారు.

➡️