ప్రజాశక్తి – ముద్దనూరు : పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల రోగాలు దరి చేరవని పిహెచ్ సి విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి, సూపర్ వైజర్ శోభా కుమారి అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో భాగంగా గురువారం మండలం లోని ఉప్పలూరు గ్రామంలో పిహెచ్ సి సిబ్బంది ఫీవర్, లార్వా సర్వే నిర్వహించారు. వారు మాట్లాడుతూ లార్వా సర్వేలో భాగంగా
తొట్లు, కుండలు, నీటి డ్రమ్ములు, వీధి రోళ్లలో నీటిని పారవేసి శుభ్రం చేయించారు. అబేట్ ద్రావణం పిచికారీ చేశారు.
దోమ కాటుకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమ కాటు వల్ల ప్రాణాంతకమైన జ్వరాల వ్యాధి బారిన పడతారన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గంగాజ్యోతి, అపర్ణ, విజయకుమారి, ఆశా కార్యకర్తలు భారతి,శకుంతల పాల్గొన్నారు.