కదంతొక్కిన కార్మికులు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, ఆప్కాస్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని, ఎంటిఎస్‌ అమలు చేయాలని, కనీసవేతనం ఇవ్వాలని, అంగన్‌వాడీల పట్ల రాజకీయ వేదింపులు ఆపాలని సోమవారం కలెక్టరేట్‌ వద్ద సిఐటియు ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్‌.చంద్రశేఖర్‌, ఎ.రామాంజులు పర్మినెంట్‌ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్టు ఉద్యోగులతో చేయిస్తున్నప్పుడు పర్మినెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు 2013లో ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో ఏ కార్యాలయంలో కూడా అమలు చేయ డంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఉద్యోగుల శ్రమను దోచుకోవడం అన్యాయమన్నారు. ఈ ఆందోళన దేశవ్యాప్తంగా 660 జిల్లాల్లో జరుగుతుందని, ఐక్య కార్యచరణ దిశగా ఉద్యమాన్ని ఉధతం చేస్తా మని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు మాత్రం నెల జీతం రూ.రెండు లక్షలు తీసు కుంటుంటే, కనీస వేతనం రూ.26 వేలు మాత్రమే అడుగు తున్నామని, చెల్లించ కపోతే పెరుగుతున్న ధరలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిం చారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోతుంటే కుటుంబాలు రోడ్డునపడుతున్నాయని, ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి సహ కారం కూడా అండదంలేదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయడానికి నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక కార్మికులకు వేతన సవరణ చేసి 15 ఏళ్లు దాటిందని, తక్షణం కనీస వేతన సలహా మండలి నియమించి షెడ్యూల్‌ పరిశ్రమల్లో కార్మికులకు వేతన సవరణ చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు అన్ని పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని కోరారు. 240 రోజులు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని, కార్మి కులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కార్మికులకు 2022 అరియర్స్‌ బకాయిలు సబ్‌ స్టేషన్‌లకు వాచ్‌మెన్లు కేటాయిచాలన్నారు. గ్రీన్‌ అంబాసిడర్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌ జీతాలకు 50 శాతం వినియోగించాలన్నారు. సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉపాధి ఇవ్వాలన్నారు. ఎనిమిది గంటలు పని అమలు చేయాలన్నారు. ప్రకతి వ్యవసాయ ఉద్యోగులకు 15 నెలల పెండింగ్‌ బకాయిలు మరియు ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లలోని గెస్ట్‌ ఫాకల్టీని రెగ్యులర్‌ చేయాలని కోరారు. మున్సిపల్‌ వర్కర్స్‌ పిఫ్‌ బకాయిలు చనిపోయిన వారి కుటుంబంలో ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఆర్‌డబ్ల్లుఎస్‌ వారికి పెండింగ్‌ జీతాలివ్వాలని తెలిపారు. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ వారు రెగ్యులర్‌ అయ్యేందుకు చేసే పోరాటలకు సిపిఎం సంపూర్ణ సహకారం ఇస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మణి పేర్కొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌కు అందజేశారు. కార్యక్రమంలో యుఇఇయు రాష్ట్ర డిస్కమ్‌ నాయకులు కె.సుబ్రహ్మణ్యంరాజు, నారాయణ, ప్రకతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మధుకర్‌, సమగ్ర సర్వ శిక్ష అభియాన్‌ జిల్లా అధ్యక్షులు మురళి మోహన్‌రాజు, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మిదేవి, గెస్ట్‌ లెక్చరర్స్‌ జిల్లా ఇన్‌ఛార్జి రహంతుల్లా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.ఓబుళమ్మ, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్యలక్ష్మి, వివిధ రంగాలకు చెందిన నాయకులు ఖదీర్‌, సుబ్బారెడ్డి, ఆనంద్‌, పెద్దిరెడ్డి, రవి, ప్రభాకర్‌రెడ్డి, జగదీశ్‌, రామాంజులు, ఈశ్వరయ్య, అలీ, రమణ, నర సింహులు, భాస్కర్‌, సిద్దయ్య, నాగరాజు, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్య, పద్మావతి, ధనశేఖర్‌, ఖాజాబీ, విజయమ్మ, సిద్దమ్మ, అరుణ, శేఖరనాయక్‌, రెడ్డెయ్య, ఖాదర్‌వలి, మాధవయ్య, ఆనంద్‌ పాల్గొన్నారు.

➡️