ప్రజాశక్తి – ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : మండలంలోని తయ్యురు మండల పశు వైద్య కార్యాలయంలో జాతీయ డి వామింగ్ దినోత్సవం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ విర్బక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో పాడిఆవులకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పాడి ఆవులు కలుషితమైన నీరు మేత ద్వారా కడుపులోకి పురుగులు చేరి పోషకాలను అందకుండా చేస్తున్నాయని అన్నారు. నులిపురుగుల నివారణ మందులు పాడి ఆవులకు వేయడంతో పాల ఉత్పత్తి బాగా పెరిగి ఆవు ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు. విర్బక్ కంపెనీ ఆధ్వర్యంలో పాడి రైతులకు డి వార్మింగ్ మందును అందించామని అన్నారు. అనంతరం పాడి రైతులకు నులిపురుగుల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విర్బక్ కంపెనీ నరసింహ, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
