విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

Sep 30,2024 21:24
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులో వరల్డ్‌ విజన్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో చదువు కోవడానికి స్కూల్‌ దూరంగా ఉండి స్కూల్‌కు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక నడిచి వెళ్లి చదువుకునే 23 మంది బాలికలకు 16 మంది బాలురకు సోమవారం సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా మునిసిపల్‌ కమిషనర్‌ అనూష, కందుకూరు ఎంఇఒలు సుబ్బారావు రెడ్డి ,అజరు బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ అనూష మాట్లాడుతూ చదువుకునే పిల్లలకు వారి సౌకర్యా ర్ధం వరల్డ్‌ విజన్‌ సంస్థ వారు సైకిళ్ళు పంపిణీ చేయడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఎంఇఒ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వరల్డ్‌ విజన్‌ సంస్థ పేద విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలనుండి స్కూల్‌ బ్యాగ్స్‌, నోట్‌ బుక్స్‌,గైడ్స్‌ బరువు తక్కువ పిల్లలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వరల్డ్‌ విజన్‌ మేనేజర్‌ కె యేషయ ఉన్నారు.

➡️