ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఇటీవల వివిధ ఆసుపత్రుల నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 10 మందికి రూ.7,94,627/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు చేతులమీదుగా గా బాధిత కుటుంబాలకు అందజేశారు. మండపేట పట్టానికి చెందిన బడ్డపాటి మంగరాజు కు రూ.24,000/-లు, షేక్ ఇస్మాయిల్ కు రూ.40,030/-లు, జెడ్.మేడపాడు గ్రామానికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ కు రూ.2,65,110/-లు, మన్యం చిట్టెమ్మ కు రూ.20,675/-లు, అర్తమూరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి కి రూ.30,000/-లు, అలాగే మరి కొందరికి మంజూరు అయినవి ఈ సంధర్బంగా వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, గుణ్ణం పనసయ్య, సత్తి శ్రీనివాసరెడ్డి, రాయుడు సురేష్, మేడపాటి రవీంద్రరెడ్డి, తిపర్తి శ్రీరమేష్, రిమ్మలపూడి సత్యనారాయణ, జన్నపల్లి సూర్యారావు, ఈదిపల్లి మంగరాజు, చుండ్రు రాజు, మోరంపూడి రాజ్ కుమార్, తాతపూడి విన్నుబాబు, దేవు శ్రీను, సత్తి సత్యనారాయణ, తానంకి చంద్రశేఖర్, తదితర్లు పాల్గొన్నారు.
