ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : స్థానిక శ్రీ సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో గిరిపుత్రులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఆ స్కూల్ డైరెక్టర్ కె.ముల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల నుంచి దుస్తులను సేకరించారు. ఈ మేరకు సేకరించిన దుస్తులను శనివారం మారేడుమిల్లి ప్రాంతంలోని గిరిజన తండాలకు విద్యార్థులతో కలసి తీసుకువెళ్లి అక్కడ వారికి దుస్తులను అందించడం జరిగిందని సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం తెలిపారు. అలాగే ”ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ కు విద్యార్థులు చేస్తున్న సేవను స్కూల్ డైరెక్టర్ ముల్లారావు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.