మున్సిపల్‌ కార్మికులకు దుస్తులు పంపిణీ

ప్రజాశక్తి – రాయచోటి పారిశుధ్య కార్యక్రమాలలో పనిచేస్తున్న కార్మికులను జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తిగా గౌరవించడం అదష్టంగా భావిస్తున్నానని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధ వారం పట్టణంలోని పిసిఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా 250 మంది మున్సిపల్‌ కార్మికులకు వస్త్రాలు, పాదరక్షల పంపిణీ చేశారు. మంత్రి స్వంత నిధులతో రాయచోటి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు ఒక జత బట్టలు, ఒక జత చెప్పులు అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ సిద్ధాం తం అహింస, స్వచ్ఛత ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిసరాలని శుభ్రంగా ఉండి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని కోరారు. తమ తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతలో పాలుపంచుకునే కార్మికులను గౌరవించడం తన అదష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాయచోటి పరిధిలోని మునిసిపల్‌ కార్మికులకు 3 సెంట్లు స్థలం ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే నగరం విస్తీర్ణం అవుతున్నందున అదనపు కార్మికుల నియామకానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే తన స్వంత నిధులు, లేదా ముఖ్యమంత్రి నిధుల నుంచి ఆర్థికపరమైన సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఉత్తమ పనితీరుతో మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు గ్రామీణ విభాగంలో సఫాయి మిత్ర సురక్ష కాంపోనెంటులో అన్నమయ్య జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛత కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసి అన్నమయ్య జిల్లాలో పరిశుభ్రంగా వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు తమ ట్రస్టు ద్వారా మంత్రి సొంత నిధులతో ఒక జత వస్త్రాలు పాదరక్షలు పంపిణీ చేశారు. విజయవాడ బుడమేరు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా నుంచి వెళ్లిన మున్సిపల్‌ కమిషనర్‌, పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా శాలువా, మెమెంటో ప్రశంస పత్రాన్ని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, టిడిపి పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదరవల్లి, డాక్టర్‌ విద్యాధర్‌, వివిధ నాయకులు పాల్గొన్నారు.

➡️