ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ

ప్రజాశక్తి-సంతనూతలపాడు : స్థానిక సేవా సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం పేదలకు బట్టలను పంపిణీ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని వెల్లంపల్లి సత్యనారాయణ గోడౌన్‌ ప్రాంగణంలో సేవా సంకల్ప్‌ ట్రస్టు కార్యాలయం ఆవరణలో పేదలకు సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహించారు. సంతనూతలపాడు మండల జడ్పిటిసి దుంపా రమణమ్మ జన్మదినం, ట్రస్ట్‌ సభ్యులు శీలం మల్లారెడ్డి, రామతులసి, దుంపా ఇంద్రసేనారెడ్డి, దివ్య జ్యోతిల వివాహ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా దుంపా చెంచిరెడ్డి రమణమ్మ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, దుస్తులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా సంకల్ప్‌ ట్రస్ట్‌కు తోడ్పడాలని చెంచిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప్‌ ట్రస్టు బృందం దుంపా చెంచిరెడ్డిని సత్కరించారు. సేవా సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ ఎన్నారై పాతూరి సంపత్‌ పర్యవేక్షణలో సేవా సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ శనగల వెంకట రమణ పర్యవేక్షణలో గత 28 వారాల నుంచి దాతల సహకారంతో పేద వర్గాలకు సేవలను, మరొకపక్క అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం ఈ వేడుకలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎంపీపీ బుడంగుంట విజయ, గ్రామ సర్పంచ్‌ దర్శి నాగమణి, సొసైటీ మాజీ అధ్యక్షులు దుంపా యలమందరెడ్డి, సేవా సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ పావులూరి నారాయణస్వామి చౌదరి, ట్రస్ట్‌ గౌరవ అధ్యక్షురాలు షేక్‌ హసీనా బేగం, సెక్రెటరీ చివుకుల రాంగోపాల్‌, జాయింట్‌ సెక్రెటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, ట్రస్ట్‌ సభ్యులు శీలం మల్లారెడ్డి, కొప్పోలు శ్రీనివాసరావు, శిఘాకొల్లి ధనలక్ష్మి, బి సుధారాణి, ఎస్‌ శ్రీనివాసరావు, వేమా నాగరాజు, అట్లూరి జాన్‌బాబు, తన్నీరు నాగేశ్వరరావు, దాచర్ల శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️