ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు మండలంలోని చీర్వానుప్పలపాడు పంచాయతీ, టి.అగ్రహారం గ్రామానికి చెందిన జాగర్లమూడి అంజమ్మకు రూ.57,989, జాగర్లమూడి లింగమ్మకు రూ.55,178, మరెళ్ల చిరంజీవికి రూ.41,218 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బి.ఎన్.విజరు కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, జాగర్లమూడి హరిబాబు, గ్రామ సర్పంచి చిన్నమ్మ, మురళీ, ఆళ్ళ నాగార్జున పొద మురళీ, పొద శ్రీధర్, పోలవరపు శ్రీకాంత్, వేణు, వినోద్, సత్యానందం, పరిటాల రఘు, మెట్టు సుబ్బయ్య, కొణిజేటి ధనుష్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.