ఫొటో : చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థికసాయం అందించి అండగా ఉంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు రూ.16.55 లక్షలు విలువైన సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. బాధితులందరి తరఫున ముఖ్యమంత్రికి మంత్రి ఆనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
