ప్రజాశక్తి – కడియం : కడియం గ్రామానికి చెందిన ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన ఫైలేరియా కిట్ల పంపిణీ స్థానిక పిహెచ్ సి నందు మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, వైద్యానికి పెద్దపీఠ వేస్తుందని అందరూ వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా అందించే సేవలను ఉచితంగా పొందుకోవాలని తెలిపారు. వైద్యాధికారిణి డాక్టర్ మణిజ్యోత్స్న మాట్లాడుతూ కడియం పి హెచ్ సి పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను ఉచితంగా అందించడం జరుగుతుందని, జిల్లా మలేరియా నియంత్రణ కార్యాలయం వారి ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫైలేరియా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోసిగంటి సత్యవతి, ఆరోగ్య విస్తరణాధికారి ఎం.రామకృష్ణ, సి హెచ్. విల్సన్ పాల్, మూర్తి, సునీత, శాంతిప్రియ, వెలుగుబంటి నాని, చిలుకూరి వెంకటేశ్వరరావు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
