ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
జిల్లా సచివాలయంలోని నూతన సమావేశపు మందిరంలో సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవద్దులశాఖ ద్వారా ఎంపిక చేయబడిన అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా లాప్ టాప్‌లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వద్దుల అసిస్టెన్స్ కార్పొరేషన్ వారు ఒక్కొక్కటి రూ.36,000లు విలువ గల లాప్‌టాప్‌లను ముగ్గురు విద్యార్థులు వేద, జ్యోష్ణ, ఆమనీలకు కలెక్టర్ అందజేశారు. ట్రైనీకలెక్టర్ హిమ వంశీ, శాఖ ఏడీ వై.శ్రీనివాసులు పాల్గొన్నారు.
